schedule Friday, September 11, 2026

శభాష్.. రిషికేష్..!

calendar_today June 29, 2025
person dharshininews
శభాష్.. రిషికేష్..!
శభాష్.. రిషికేష్..! - సీమ్స్ ఒలంపియాడ్ లో ప్రతిభ - జాతీయ స్థాయి పరీక్షల్లో స్టేట్ ఫోర్త్ ర్యాంకు - అభినందించిన బీసీ సంఘం నాయకులు తాండూరు, దర్శిని ప్రతినిధి : శభాష్.. రిషికేష్ అంటూ తాండూరు పట్టణం బీసీ సంఘం యువనాయకుడు రాము ముదిరాజ్ కుమారుడికి పలువురు అభినందించారు. సీమ్స్ ఒలంపీయాడ్ పరీక్షల్లో రిషికేష్ ముదిరాజ్ జాతీయ స్థాయి పరీక్షల్లో ప్రతిభ కనబరిచాడు. తాండూరు పట్టణంలోని విశ్వవేద పాఠశాలలో రిషికేష్ నాలుగవ తరగతి చదువుతున్నాడు. ఇటీవల నిర్వహించిన జాతీయ స్థాయి సీమ్స్ ఒలంపియాడ్ పరీక్షల్లో రిషికేష్ రాష్ట్రస్థాయిలో నాలుగో స్థానంలో నిలిచి ప్రతిభను కనబరిచాడు. ఇందుకు గాను శనివారం హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రిషికేష్ కు ప్రతిభా పురస్కారం అందుకున్నాడు. ఈ సందర్భంగా పలువురు నాయకులు, బీసీ సంఘం నేతలు చిన్నారి రిషికేష్ ను శభాష్ అంటూ అభినందించారు. ఇలాంటి అవార్డులు ఎన్నో సాధించి తాండూరుకు తల్లిదండ్రులకు, పాఠశాలకు పేరు తీసుకరావాలని ఆకాంక్షించారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/36495/