schedule Thursday, September 10, 2026

ఎస్ఐ మహిపాల్ రెడ్డి సేవలు మరువలేనివి

calendar_today June 30, 2025
person dharshininews
ఎస్ఐ మహిపాల్ రెడ్డి సేవలు మరువలేనివి
ఎస్ఐ మహిపాల్ రెడ్డి సేవలు మరువలేనివి - తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి - పట్టణ పోలీస్టేషన్ లో పదవి విరమణ వీడ్కోలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణ ఎస్ఐ మహిపాల్ రెడ్డి పోలీసు శాఖలో అందించిన సేవలు మరువలేనివని డీఎస్పీ బాలకృష్ణారెడ్డి అన్నారు. ఎస్ఐ మహిపాల్ రెడ్డి పదవి విరమణ వీడ్కోలును పట్టణ పోలీస్టేషన్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, పట్టణ సీఐ సంతోష్ కుమార్ లు పదవి విరమణ పొందిన ఎస్ఐ మహిపాల్ రెడ్డిని శాలువాతో సత్కరించి సన్మానించారు. అనంతరం డీఎస్పీ బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ కానిస్టేబులుగా విధుల్లో చేరిన ఎస్ఐ మహిపాల్ రెడ్డి హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ, ఎస్ఐగా ఎదగడం గర్వకారణమన్నారు. వృత్తిపట్ల అంకిత భావంతో 41 ఏండ్ల పాటు పోలీసు శాఖకు అందించిన సేవలు మరువలేనివి అని అన్నారు. ఆయన సేవలు సిబ్బందికి, అధికారులకు స్ఫూర్తిగా నిలుస్తాయన్నారు. అదేవిధంగా పోలీస్టేషన్ ఎస్ఐలు, ఏఎస్ఐలు, కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, సిబ్బంది ఎస్ఐ మహిపాల్ రెడ్డిని సన్మానించి శుభాకంక్షలు తెలిపారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/36510/