schedule Thursday, September 10, 2026

దేశ రక్షణ నిధికి మరోసారి విరాళం..!

calendar_today July 10, 2025
person dharshininews
దేశ రక్షణ నిధికి మరోసారి విరాళం..!
దేశ రక్షణ నిధికి మరోసారి విరాళం..! - ఆర్బీఓఎల్ నుంచి రూ. 2లక్షల డిపాజిట్ - సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి ఉదారత తాండూరు, దర్శిని ప్రతినిధి : భారత దేశ రక్షణ నిధికి యాలాల మండలం జక్కెపల్లి పరిధిలోని రాడికల్ బయో ఆర్గానిక్స్ లిమిటెడ్(ఆర్బీఓల్) మరోసారి విరాళం అందించింది. పెహెల్గాం ఉగ్రదాడి తరువాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞప్తి మేరకు ఆర్బీఎల్ సంస్థ తరుపున జాతీయ రక్షణ నిధికి విరాళం అందిస్తున్నారు. ఇప్పటికే రెండు సార్లు సాయం అందించిన ఆర్బీఓఎల్ తాజాగా గురువారం మరోసారి విరాళం డిపాజిట్ చేసింది. ఈ విషయాన్ని ఆర్బీఓఎల్ సీఈఓ శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. గత మే నెలలో రూ.2లక్షల విరాళం అందజేయగా... పోయిన నెల జూన్ లో రూ. 3లక్షలు అందించిన విషయాన్ని గుర్తుచేశారు. తాజాగా ఆర్బీఓఎల్ సంస్థ తరుపున జాతీయ రక్షణ నిధికి రూ. 2లక్షల విరాళం డిపాజిట్ చేసినట్లు వెల్లడించారు. ఆర్బీఓఎల్ కర్మాగారం ఆధాయంలో ప్రతి నెల రూ.2లక్షలు అందిస్తామని సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదివరకు రూ.2లక్షలు ఒకసారి, రూ. 3లక్షలు ఒకసారి, తాజాగా రూ. 2లక్షలతో మొత్తం రూ. 7లక్షల విరాళం అందించారు. ఇచ్చిన హామి మేరకు తమ కర్తవ్యాన్ని నిర్వహించడం పట్ల శ్రీనివాస్ రెడ్డి గొప్ప ఉదారతను అందరు అభినందిస్తున్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/36786/