schedule Wednesday, September 09, 2026

మహిమాన్వితం శివపార్వతుల లీలలు

calendar_today July 20, 2025
person dharshininews
మహిమాన్వితం శివపార్వతుల లీలలు
మహిమాన్వితం శివపార్వతుల లీలలు - పండితులు మదన్మోహన్ స్వామీజీ - కొనసాగుతున్న రాజస్థాని మహిళ మండలి శివ మహాపురాణం తాండూరు, దర్శిని ప్రతినిధి : శివపార్వతుల లీలలు ఎంతో మహిమాన్వితమైనవి అని జైపూర్ పండితులు మదన్మోహన్ స్వామీజీ అన్నారు. వచ్చే శ్రావణ మాసం సందర్భంగా తాండూరు రాజస్థాని మహిళ మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శివ మహాపురాణం ఆదివారం మూడో రోజు కొనసాగింది. పట్టణంలోని గగ్రానీ గార్డెన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జైపూర్ నుంచి వచ్చిన ప్రముఖ పండితులు మదన్ మోహన్ స్వామిజీ హాజరై అద్భుతమైన ప్రవచనాలను వినిపించారు. అంతకుముందు కార్యక్రమంలో భాగంగా శివపార్వతుల కళ్యాణోత్సవం నిర్వహించారు. ఈ కళ్యాణోత్సవంలో వైభవ్ బూబ్ శివునిగా, పార్వతిగా మేఘనా భూబ్ ప్రదర్శన ఇచ్చారు. అనంతరం మదన్మోహన్ స్వామిజీ అద్భుతమైన ప్రవచనాలతో శివును లీలను వినిపించారు. ఈ ప్రవచనాలకు మహిళలు, భక్తులు మంత్రముగ్దులయ్యారు. శివ పార్వతులను కొలిచే భక్తి మార్గాన్ని అనుసరించాలని సూచించారు. ఈ శివ మహాపూరణంకు కర్ణాటక రాష్ట్రం యాదగిరి, సేడం, గుల్బర్గా, వికారాబాద్, సదాశివపేట్, మహబూబ్ నగర్, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో మహిళ మండలి అధ్యక్షురాలు కిరణ్ మన్మోహన్ సార్డా, కార్యదర్శి వర్షా కైలాస్ సార్డా, కోశాధికారి కల్పన ఆనంద్ రాఠీ, హేమా గోవింద్ సోని, వైజయంతి భగవాన్ దాస్ బూబ్, రాధిక మధుసూదన్ సార్డా, రీతు సంజయ్ సోని, సమాజం పెద్దలు, మమిళలు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/37030/