schedule Wednesday, September 09, 2026

శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేయండి

calendar_today July 22, 2025
person dharshininews
శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేయండి
శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేయండి - తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి - ఎమ్మెల్యేను కలిసిన సబ్ డివిజన్ నూతన ఎస్ఐలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు సబ్ డివిజన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేయాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పోలీసు అధికారులకు సూచించారు. ఇటీవల జరిగిన బదీలీల ప్రక్రియలో భాగంగా సబ్ డివిజన్ లోని కరణ్ కోట్, బషీరాబాద్, పెద్దేముల్, యాలాల పోలీస్టేషన్లకు కొత్త ఎస్ఐలు నియామకం అయ్యారు. ఇందులో భాగంగా మంగళవారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని తాండూరు రూరల్ సీఐ వై.నగేష్ సమక్షంలో కరణ్ కోట్ ఎస్ఐ ఐ రాథోడ్ వినోద్, యాలాల ఎస్ఐ విఠల్, బషీరాబాద్ ఎస్ఐ నూమాన్ అలీ, పెద్దేముల్ ఎస్ఐ వేణు కుమార్ లు మర్యాద పూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యేకు పుష్పగుచ్చం అందించి పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ తాండూరు సబ్ డివిజన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేయాలని సూచించారు. ఎలాంటి అవినీతి, అక్రమాలు జరగకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/37092/