schedule Wednesday, September 09, 2026

కొత్త రేషన్ కార్డు దారులకు గుడ్ న్యూస్..!

calendar_today July 23, 2025
person dharshininews
కొత్త రేషన్ కార్డు దారులకు గుడ్ న్యూస్..!
కొత్త రేషన్ కార్డు దారులకు గుడ్ న్యూస్..! - వారికి కూడా ఆ పథకాలు వర్తింపు - దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలోని పేదలకు ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా పలు పథకాలను అమలు చేస్తోంది. పదేళ్లుగా రేషన్‌ కార్డులు ఇప్పటి వరకు మంజూరు కాకపోవడంతో గత, ప్రస్తుత ప్రభుత్వాల్లో వివిధ పథకాలకు చాలా మంది అర్హులు దూరమయ్యారు. ప్రభుత్వంలో ఏ పథకం పొందాలన్నా రేషన్ కార్డు తప్పనిసరిగా మారింది. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్‌ కార్డులు మంజూరు చేస్తుండటంతో లబ్ధిదారుల్లో ఆశలు చిగురించాయి. ఇప్పటికే రేషన్ కార్డులు ఉన్న లబ్దిదారులు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు దరఖాస్తులు చేసుకుని లబ్దిపొందుతున్నారు. గృహజ్యోతి కింద ఉచిత విద్యుత్, రూ. 500లకే గ్యాస్ సిలిండర్ పొందుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వం మంజూరు చేసిన కొత్త రేషన్ లబ్దిదారులు కూడా ఈ పథకాలకు దరఖాస్తు చేసుకునే అర్హత లభించింది. కొత్త రేషన్ కార్డులు పొందిన లబ్దిదారులు ప్రజా పాలన కింద పథకాలకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచిస్తున్నారు. ఇందుకు లబ్దిదారులు దరఖాస్తుల చేసుకుంటే ఉచిత విద్యుత్, గ్యాస్ సిలిండర్ తదితర పథకాల ద్వారా లబ్దిపొందవచ్చు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/37098/