schedule Wednesday, September 09, 2026

డ్రైన్‌ల ఆక్రమణలపై కొరడా..!

calendar_today July 24, 2025
person dharshininews
డ్రైన్‌ల ఆక్రమణలపై కొరడా..!
డ్రైన్‌ల ఆక్రమణలపై కొరడా..! - కూల్చివేతలు చేపట్టిన 'తాండ్రా' టీం - ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద తొలగింపు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని జాతీయ రోడ్డు డ్రైన్‌పై కొందరు వ్యాపారులు చేపట్టిన ఆక్రమణలపై 'తాండ్రా' కొరడా జులిపించింది. గురువారం తాండూరు పట్టణం ఆర్టీసీ బస్టాండ్ దుకాణాల సముదాయాల వద్ద కూల్చివేతలు చేపట్టింది. మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి ఆదేశాల మేరకు టీం జేసీబీతో దుకాణాల సముదాయాల వద్ద ఆక్రమ నిర్మాణాలను తొలగింపు చేయించారు. ఆర్టీసీ దుకాణాల సముదాయం ముందు కొందరు వ్యాపారులు జాతీయ రోడ్డు భారీ డ్రైన్‌పై నిర్మాణాలు చేపట్టుకున్నారు. దీంతో రోడ్డు ఇరుకుగా మారి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆక్రణలు తొలగింపు చేసుకోవాలని అధికారులు సూచించినా వ్యాపారులు వినిపించుకోవడం లేదని పేర్కొంటూ తాండ్రా టీం గురువారం ఉదయం కూల్చివేతలు చేపట్టారు. దుకాణాల సముదాయాల ముందు ఉన్న మెట్లు, ర్యాంపులు పూర్తిగా తొలగించారు. వ్యాపారులు డ్రైన్‌ వెనుక భాగం నుంచి వ్యాపారాలు చేసుకోవాలని సూచించారు. నిబంధనలకు విరుద్దంగా వెళితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇదిలా ఉండగా దుకాణం సముదాయంలోని ఓ వ్యాపారి తనను టార్గెట్ చేసుకుని నిర్మాణాలు కూల్చివేశారని తాండ్రా టీంతో వాగ్వివాదం చేశాడు. దీంతో వ్యాపారి, అధికారుల మద్య రభస జరిగింది. ఇదికూడా చదవండి.... https://www.dharshininews.com/37133/