schedule Wednesday, September 09, 2026

చదువుకోసం కష్టాలు..!

calendar_today July 25, 2025
person dharshininews
చదువుకోసం కష్టాలు..!
చదువుకోసం కష్టాలు..! - బేంచీలు మోసిన విద్యార్థులు - పాత భవనంలో భయం భయం - తాండూరు కాలేజీ విద్యార్థులు చాకిరి తాండూరు, దర్శిని ప్రతినిధి : చదువుకోవాలంటే పేద విద్యార్థులకు కష్టాలు తప్పడం లేదు. తమ చదువుకోసం చాకిరి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో విద్యార్థులు బేంచీలు మోసుకుంటూ వెళ్లడం కనిపించింది. శుక్రవారం కనిపించిన దృశ్యాలను చూసి పలకరించగా కాలేజీ విద్యార్థుల దయనీయ పరిస్థితిని వివరించారు. కాలేజీలోని చదువుకునే భవనం శిథిలావస్థకు చేరిందని, దీంతో భయం భయంగా చదువుకోవాల్సి వస్తుందని తెలిపారు. ముందే వర్షాలు కురుస్తుండడంతో భవనం ఎప్పుడు కూలిపోతుందో అని ఆందోళనకు గురైనట్లు తెలిపారు. దీంతో పాత భవనం నుంచి కాలేజీ వెనుక భాగంలో ఉన్న కొత్త భవనంలోకి వెళ్లేందుకు బేంచీలను మోసుకెళుతున్నట్లు తెలిపారు. బేంచీలు తరలించేందుకు ఎలాంటి సౌకర్యాలు లేకపోవడంతో తామే స్వచ్ఛందంగా మోసుకెళుతున్నట్లె చెప్పారు. దీంతో విద్యార్థులు చదుకునేందుకు పడుతున్న కష్టాలు విచారాన్ని కలిగించాయి. కాలేజీలో శిథిల భవనంను మరమ్మత్తులు చేయించి అభివృద్ధి పరిస్తే ఎంతో మేలు జరుగుతుందని కాలేజీ అధ్యాపకులు, విద్యార్థులు కోరుతున్నారు. ఇదికూడా చదవండి.... https://www.dharshininews.com/37182/