schedule Wednesday, September 09, 2026

రాముని గుడికి ఎన్‌ఆర్ఐ భక్తుల విరాళం

calendar_today July 25, 2025
person dharshininews
రాముని గుడికి ఎన్‌ఆర్ఐ భక్తుల విరాళం
రాముని గుడికి ఎన్‌ఆర్ఐ భక్తుల విరాళం - రూ. 1 లక్ష 1 వెయ్యి అందజేత - కృతజ్ఞతలు తెలిపిన దేవాలయ కమిటి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని ఏకైక రామ మందిరంలోని శ్రీరాముడి కోసం ఎన్‌ఆర్ఐ భక్తులు విరాళం అందించారు. ఇందిరా నగర్‌లోని శ్రీరామ మందిరాన్ని దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో దేవాలయ పునర్ నిర్మాణం చేపడుతున్నారు. ఇందుకోసం భక్తులు తమ వంతు సహాకారం అందిస్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ కు చెందిన ఎన్ఆరి కుటుంబ సభ్యులు స్వర్ణలత మనీష్ మిశ్రా శ్రీరామ మందిర పునర్ నిర్మాణానికి తనవంతుగా రూ. 1లక్ష 1 వెయ్యిని విరాళంగా ఇచ్చారు. ఈ సందర్భంగా దేవాలయ కమిటి సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. దేవాలయ పునర్ నిర్మాణానికి స వాకరించడం పట్ల ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా దేవాలయ పునర్ నిర్మాణంలో భక్తులు ఎవ్వరైనా భాగస్వాములు కావచ్చని తెలిపారు. దాతలు తమకు తోచినంత సహాకారం అందించి శ్రీరాముని ఆశీస్సులు పొందాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రింది స్కానర్ ద్వారా సాయం చేయవచ్చు.. ఇదికూడా చదవండి.. https://www.dharshininews.com/37191/