అప్రమత్తంతోనే గుండె పోటు నియంత్రణ
July 26, 2025
dharshininews
అప్రమత్తంతోనే గుండె పోటు నియంత్రణ
- జన్యువు పరీక్షలతో హార్ట్ అటాక్ ప్రమాదాల గుర్తింపు
- వికారాబాద్ జిల్లా డాక్టర్ భీమేష్ పూసల
- అకస్మిక గుండె మరణాలపై పరిశోధన పూర్తి
- భారత్ ఇన్సుట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ప్రదర్శన
వికారాబాద్, దర్శిని ప్రతినిధి : మారుతున్న జీవన శైలిలో అప్రమత్తంగా ఉంటేనే గుండె పోటు మరణాల నుంచి తప్పించుకోవచ్చని వికారాబాద్ జిల్లాకు డా.భీమేష్ పూసల సూచిస్తున్నారు. యువతలో సంభవిస్తున్న గుండె పోటు మరణాలపై ఆయన సరికొత్త పరిశోధన(పీహెచ్డీ) చేపట్టారు.
ఎఫ్‌టీఓ జన్యువులపై పరీక్షలతో పాటు కొరోనరీ ఆర్టరీ వ్యాధిపై పరిశోధన చేశారు. హైదరాబాద్‌లోని అనాటమీ అసిస్టెంట్ ప్రోఫెసర్‌గా పనిచేస్తూనే తన పరిశోధన చేశారు. తన పరిశోధనను చెన్నైలోని ప్రతిష్టాత్మక భారత్ ఇన్సుట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో తన పరిశోధనను పూర్తి చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 20-30 ఏండ్లలోని యువతలో ఆకస్మిక మరణాలు జరుగుతుండడంతో తన పరిశోధనలు చేపట్టినట్లు తెలిపారు. జన్యువు మార్పుల వల్ల ఈ మరణాలు జరుగుతున్నట్లు పరిశోధనలో గుర్తించడం జరిగిందన్నారు. ఊబకాయం, మధుమేహం, రక్తపోటు వంటి వ్యాధులు గుండె అనారోగ్యానికి సంకేతాలు ఇస్తాయని తెలిపారు. ఒక్కోసారి వంశపారంపరమైన జన్యువు సమస్యలతో గుండెపోటు వచ్చే అవకాశాలు ఉన్నాయని తన పరిశోధనలో తేలిందన్నారు.
అయితే అకస్మిక గుండె మరణాలు నియంత్రించడంతో జన్యువు పరీక్షలు దోహదపడతాయని తెలిపారు. ఈ జన్యువు పరీక్షలతో మనిషిలో అనారోగ్య సమస్యలను గుర్తించవచ్చన్నారు. గుండె జబ్బుల గురించి మరింత తెలుసుకోవడానికి, వైద్యుడిని సంప్రదించడంలో కీలకంగా మారుతాయన్నారు. ఈ పరిశోధనల ద్వారా, యువకులలో ఆకస్మిక గుండె జబ్బులను ముందుగానే గుర్తించడానికి అవకాశం ఉంది. జన్యు పరీక్షలు కుటుంబ చరిత్రను పరిగణనలోకి తీసుకోవడం ద్వారా, ప్రమాదంలో ఉన్న వ్యక్తులను గుర్తించవచ్చని అన్నారు.
అదేవిధంగా గుండెపోటు మరణాల నుంచి కాపాడుకునేందుకు నియమాలను పాటించాలని సూచించారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ధూమపానం, మద్యపానం మానేయడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ముఖ్యమని అన్నారు. అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, మధుమేహం వంటి వాటిని నియంత్రణలో ఉంచుకోవడం వల్ల గుండెపోటు నుంచి రక్షణ పొందవచ్చని తెలిపారు. మరోవైపు వికారాబాద్‌కు చెందిన డా. భీమేష్ పూసల చేసిన పరిశోధనలపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇదికూడా చదవండి...
https://www.dharshininews.com/37216/