schedule Wednesday, September 09, 2026

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి

calendar_today July 26, 2025
person dharshininews
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి - వ్యాధులు రాకుండా పరిసరాలను శుబ్రంగా ఉంచాలి - తాండూరు మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి - సాయిపూర్‌లో ఎస్టీ బాలికల వసతిగృహం తనిఖీ తాండూరు, దర్శిని ప్రతినిధి : విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి వ్యాధుల బారిన పడకుండా దృష్టిసారించాలని తాండూరు మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి అన్నారు. శనివారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశాల మేరకు తాండూరు పట్టణం సాయిపూర్ లోని ఎస్టీ బాలికల వసతి గృహాన్ని మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలుతో కలిసి తనిఖీ చేశారు. వసతి గృహంలో వంటగదిలో విద్యార్థులకు వండే రేషన్ బియ్యం, కూరగాయలు, సరుకులను పరిశీలించారు. అదేవిధంగా వసతి గృహం పరిసరాలను, మరుగుదొడ్లు, తాగునీటి వసతిని కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్యంపై దృష్టి సారించాలన్నారు. విద్యార్థులకు మెను ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలన్నారు. విద్యార్థులు వ్యాధుల బారిన పడకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు జుబేర్ లాల, ప్రభాకర్ గౌడ్, రాము, మున్సిపల్ ఇంచార్జ్ శానిటరీ ఇనుస్పెక్టర్ వెంకటయ్య, జవాన్లు తదితరులు ఉన్నారు. ఇదికూడా చదవండి.. https://www.dharshininews.com/37239/