schedule Wednesday, September 09, 2026

వైభవంగా వరలక్ష్మీ పూజ

calendar_today August 8, 2025
person dharshininews
వైభవంగా వరలక్ష్మీ పూజ
వైభవంగా వరలక్ష్మీ పూజ - శంకర్ యాదవ్  నివాసంలో సందడి - పూజలో పాల్గొన్న దంపతులు - హాజరైన ప్రజా ప్రతినిధులు, నేతలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరుకు ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి, శ్రీ సాయిపుత్ర హోమ్స్ అండ్ డెవలపర్స్ అధినేత భావనోళ్ల శంకర్ యాదవ్ నివాసంలో వరలక్ష్మీ పూజ వైభవంగా జరిగింది. kvcs మహిళలు తమ భర్త క్షేమంతో పాటు సౌభాగ్యం కోసం, కోరిన కోర్కెలు నెరవేరాలని వరలక్ష్మీ వ్రతం నిర్వహించడం హిందూ సంప్రదాయం. ఇందులో భాగంగా శ్రావణమాసం రెండో శుక్రవారం తాండూరు పట్టణంలోని భావనోళ్ల శంకర్ యాదవ్ నివాసంలో ఆయన సతీమణి చంద్రకళ వైభవలక్ష్మీ వ్రత పూజ నిర్వహించారు. ఈ పూజలో శంకర్ యాదవ్, చంద్రకళ దంపతులు పాల్గొని వేద పండితులు విశ్వం పంతులు ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులు, బందుమిత్రులు, పలువురు ప్రజా ప్రతినిధులు, నేతలు హాజరు కావడంతో వారి ఇంట సందడిగా మారింది. ఈ కార్యక్రమంలో బావనోళ్ల హన్మయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్ షర్సన్ పట్లోళ్ల రత్నామల నర్సింలు, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, సీనీయర్ నాయకులు బంటు మల్లప్ప, బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్, మనోహర్ యాదవ్, జొన్నల వినోద్ కుమార్, మదన సింహారెడ్డి, మాజీ కౌన్సిలర్లు ప్రభాకర్ గౌడ్, వరాల శ్రీనివాస్ రెడ్డి, సీనీయర్ జర్నలిస్టు పట్లోళ్ల వేణుగోపాల్ రెడ్డి, బంటారం మాజీ ఎంపీపీ రాములు యాదవ్, ప్రశాంత్ గౌడ్ తదితరులు హాజరై దర్శించుకున్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/37524/