schedule Wednesday, September 09, 2026

సోదరుడికి రాఖీ కట్టిన మాజీ మంత్రి సబితారెడ్డి

calendar_today August 9, 2025
person dharshininews
సోదరుడికి రాఖీ కట్టిన మాజీ మంత్రి సబితారెడ్డి
సోదరుడికి రాఖీ కట్టిన మాజీ మంత్రి సబితారెడ్డి - నర్సింహారెడ్డి(బాబు) ఇంట పండగ సందడి - కుటుంబంలో వెల్లివిరిసిన సంతోషం తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి తన సోదరుడు నర్సింహారెడ్డి(బాబు)కు రాఖీ కట్టారు. శనివారం రాఖీ పౌర్ణమి సందర్భంగా మాజీ మంత్రి సబితారెడ్డి హైదరాబాద్‌లోని తన సోదరుడు ఇంద్రారెడ్డి ట్రస్ట్‌ చైర్మన్‌ నర్సింహారెడ్డి నివాసానికి వెళ్లి ఆయనకు రాఖీ కట్టారు. ఈ సందర్భంగా సబితారెడ్డి మాట్లాడుతూ.. అక్కా తమ్ముళ్లు, అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్‌ అని, ప్రజలకు పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో నర్సింహారెడ్డి సతీమణి సుష్మితారెడ్డి, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఇంద్రారెడ్డి నివాసంలో రాఖీ పండగ సందడి.. సంతోషాలు వెల్లివిరిశాయి. kvcs ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/37570/