schedule Friday, September 04, 2026

తాండూరులో మరో రెండు డేంగీ కేసులు

calendar_today August 13, 2025
person dharshininews
తాండూరులో మరో రెండు డేంగీ కేసులు
తాండూరులో మరో రెండు డేంగీ కేసులు - అప్రమత్తమైన వైద్య అధికారులు - బాధిత ప్రాంతంలో ప్రజలకు అవగాహన తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో మరో రెండు డేంగీ కేసులు వెలుగులోకి వచ్చాయి. పట్టణంలోని రాజీవ్ కాలనీఓ ఓ వ్యక్తికి డేంగీ నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. kvcs తాజాగా పట్టణంలోని ఇందిరానగర్ లోని గరీబ్ నగర్ ప్రాంతానికి ఇద్దరికి డేంగీ నిర్ధారణ అయ్యింది. బుధవారం స్థానిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు డా. మాలాశ్రీ ఆధ్వర్యంలో సిబ్బంది అప్రమత్తం అయ్యారు. డేంగీ బాధితుల నివాసాలకు వెళ్లి అవగాహన కల్పించారు. మున్సిపల్ సిబ్బంది ద్వారా పరిసర ప్రాంతాల్లో మందు పిచికారి చేయించారు. ఈ సందర్భంగా డా.మాలాశ్రీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు సీజన్ వ్యాధులను దృష్టిలో ఉంచుకుని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ముఖ్యంగా నీళ్లు నిల్వ ఉండకుండా తొట్లు, కొబ్బరి బొండాలు, ఇతర వాటిని శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. దోమల లార్వా వ్యాప్తి చెందకుండా చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు, ఏఎస్ఎంలు, ఆశ వర్కర్లు, మున్సిపల్ జవాన్ రవి, సిబ్బంది ఉన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/37689/