schedule Wednesday, September 09, 2026

ఏడాది శుభ్రం కాని మురుగు కాలువ

calendar_today August 14, 2025
person dharshininews
ఏడాది శుభ్రం కాని మురుగు కాలువ
ఏడాది శుభ్రం కాని మురుగు కాలువ - కార్యాలయంలో ఫిర్యాదు చేసిన కాలనీ వాసులు తాండూరు, దర్శిని ప్రతినిధి : మా వార్డులో ఏడాదిగా మురుగు కాలువ శుభ్రం చేయడం లేదంటూ కాలనీ వాసులు మొరపెట్టుకున్నారు. గురువారం తాండూరు మున్సిపల్ కార్యాలయానికి వచ్చి అధికారులకు ఫిర్యాదు చేశారు. kvcs వివరాల్లోకి వెళితే.. మున్సిపల్ పరిధిలోని 36వ వార్డులో మురుగు కాలువ శుభ్రం చేయడం లేదని కాలనీ వాసులు ఆరోపించారు. కాలువ శుభ్రం చేయక పోవడంతో ఈగలు, దోమల స్వైర విహారం చేస్తున్నాయని, ఫలితంగా రోగాల బారిన పడుతున్నామని ఆవేధన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఏడాది కాలంగా శుభ్రం చేయని మురుగు కాలువను శుభ్రం చేయించి కాలనీ వాసుల ఆరోగ్యాన్ని కాపాడాలని వినతిపత్రం అందించి మొరపెట్టుకున్నారు. అదేవధంగా కాలనీలో వీధి కుక్కల బెడద కూడా ఉందని, ప్రజలను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కమీషనర్ అందుబాటులో లేకపోవడంతో మేనేజర్ నరేందర్ రెడ్డికి కాలనీ వాసులు వినతిపత్రం అందజేశారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/37732/