schedule Friday, September 04, 2026

డెంగ్యూపై యుద్ధం..!

calendar_today August 19, 2025
person dharshininews
డెంగ్యూపై యుద్ధం..!
డెంగ్యూపై యుద్ధం..! - కాలనీబాటలో వైద్యాధికారులు - ఇందిరా నగర్ లో పర్యటన  - వ్యాధి నియంత్రణకు అవగాహన  - మున్సిపల్ నుంచి మందు పిచికారీ తాండూరు, దర్శిని ప్రతినిధి: వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో విజృంభిస్తున్న డేంగ్యూ, మలేరియా వ్యాధులపై యుద్ధం ప్రారంభించారు. kvcs వైద్యాధికారులు మున్సిపల్ సిబ్బంది సంయుక్తంగా సీజనల్ వ్యాధుల నియంత్రణకు చర్యలు చేపట్టారు. గత కొన్ని రోజులుగా తాండూరులో డెంగ్యూ కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. పట్టణంలోని రాజీవ్ కాలనీ, ఇందిరమ్మ కాలనీలో కేసులు నమోదయ్యాయి. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కూడా కేసుల నమోదుపై ఆరా తీశారు. జిల్లా వైద్యాధికారి, సూపరిండెంట్ లతో మాట్లాడారు. కేసుల నమోదు పట్ల అధికారులు అప్రమత్తమయ్యారు. ఇందులో భాగంగా మంగళవారం తాండూరు పట్టణం ఇందిరానగర్ బెగ్గర్స్ కాలనీ లో సబ్ యూనిట్ ఆఫీసర్ ప్రకాష్, హెల్త్ అసిస్టెంట్ సుదర్శన్, ఆరోగ్య కేంద్ర వైద్యురాలు డా. మాలాశ్రీ, వైద్య సిబ్బంది ఇంటింటి వద్దకు వెళ్లి పరిశీలించారు. కాలనీ ప్రజలు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. మలేరియా, డెంగ్యూ వ్యాధులు రాకుండా అవగాహన కల్పించారు. ఇళ్లలో ఉండే గోళాలు, కుండీలు, నీరు నిల్వ ఉండే వస్తువులు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. మరోవైపు మున్సిపల్ సిబ్బంది దోమల గారు చెందకుండా మందు పిచికారి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్, ఏఎన్ఎంలు రేణుక, పార్వతీ, ఆశ కార్యకర్త, మున్సిపల్ జవాన్లు రవి, బాలు, సిహెచ్ అశోక్, తదితరులు పాల్గొన్నారు.   ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/37902/