schedule Wednesday, September 09, 2026

ఏసీబీని ఆశ్రయించిన ఈర్షాద్‌కు బెదిరింపులు

calendar_today August 20, 2025
person dharshininews
ఏసీబీని ఆశ్రయించిన ఈర్షాద్‌కు బెదిరింపులు
ఏసీబీని ఆశ్రయించిన ఈర్షాద్‌కు బెదిరింపులు - పోలీసులకు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ నాయకుడు - శత్రవుల నుంచి రక్షణ కల్పించాలని విజ్ఞప్తి తాండూరు, దర్శిని ప్రతినిధి : మున్సిపల్ అధికారిని ఏసీబీకి పట్టించిన తనపై కొందరు బెదిరింపులకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈర్షాద్ తెలిపారు. kvcs బుధవారం తనపై బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై తాండూరు పట్టణ పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. పట్టణంలోని సర్వే నెంబర్ 26లో తనకు చెందిన షెడ్ కు ఇంటి నెంబర్ కేటాయింపు విషయంలో రూ. 15వేలు డిమాండ్ చేయడంతో మున్సిపల్ సీనీయర్ అసిస్టెంట్ రమేష్ ను ఈర్షాద్ ఏసీబీ అధికారులకు పట్టించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై రమేష్ సోదరుడు నాగేష్ తనను చంపుతానని బెదిరించారని ఈర్షాద్ చెప్పుకొచ్చారు. ఈ సమయంలో బాతులు నాగు అనే కాంగ్రెస్ నాయకుడు కూడా పక్కనే ఉన్నారని అన్నారు. మంగళవారం రాత్రి వేళ తనను హతమార్చేందుకు ఇంటి పరిసర ప్రాంతానికి వచ్చారని ఆరోపించారు. నాగేష్, బాతుల నాగుల నుంచి తనకు ప్రాణహాని ఉందని పోలీసులకు అందించిన ఫిర్యాదులో పేర్కొన్నారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. తనకు ఏమైనా జరిగితే రమేష్ సోదరుడు నగేష్, బాతుల నాగులే బాధ్యులవుతారని అన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/37953/