schedule Wednesday, September 09, 2026

తప్పించుకునే కుట్రలు సాగనివ్వం..!

calendar_today August 22, 2025
person dharshininews
తప్పించుకునే కుట్రలు సాగనివ్వం..!
తప్పించుకునే కుట్రలు సాగనివ్వం..! - స్థానికంలో రిజర్వేషన్లు అమలు చేయాలి - 25న ఆర్. కృష్ణయ్య సత్యాగ్రహ దీక్షకు తరలిరండి - బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ తాండూరు, దర్శిని ప్రతినిధి : వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించకుండా తప్పించుకునేందుకు చేస్తున్న కుట్రలు సాగనిచ్చేది లేదని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ అన్నారు. శుక్రవారం ఆయన ఓ ప్రకటనలో మాట్లాడారు. kvcs స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, రాజకీయ పార్టీలు తలో వైఖరిని ప్రదర్శిస్తున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి రిజర్వేషన్లకు పూర్తి అధికారం ఉన్నప్పటికి కేంద్రంపై నెట్టి వేస్తూ తప్పించుకునె ందుకు ప్రయత్నిస్తుందని విమర్శించారు. రిజర్వేషన్లు కల్పించే అధికారం రాజ్యాంగం కల్పించినా పార్టీల మద్దతుతో అమలు చేసేందుకు కార్యాచరణ తీసుకోవాలన్నారు. కాని వాటిపై శ్రద్ద చూపడం లేదని అన్నారు. అదేవిధంగా బీసీ సంఘం జాతీయ నాయకులు ఆర్. కృష్ణయ్య 50ఏళ్లుగా 50శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని పోరాటం చేస్తున్నారని అన్నారు. ఇప్పటికే బీసీ వసతి గృహాలు, గురుకులాలు, ఫీజ్ రియంబర్స్ మెంట్, స్కాలర్ షిప్ల పెంపు, విద్యార్థులకు సన్నబియ్యం వంటి ఎన్నో ఫలితాలను సాధించడం జరిగిందని గుర్తుచేశారు. ఇక తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈనెల | 25న హైదరాబాద్ లో ఇందిరా పార్కు వద్ద సత్యాగ్రహ దీక్ష చేపడుతున్నారని తెలిపారు. ఈ దీక్షకు బీసీలంతా ఏకమై భారీ ఎత్తున మద్దతుకు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/38013/