schedule Wednesday, September 09, 2026

అర్దరాత్రి దర్జా దొంగా..!

calendar_today August 30, 2025
person dharshininews
అర్దరాత్రి దర్జా దొంగా..!
అర్దరాత్రి దర్జా దొంగా..! - మాస్కెసుకుని బ్యాంకులో చొరబాటు - సీసీ కెమెరాలో దొంగ దృశ్యాలు నమోదు - బషీరాబాద్‌ ఎస్బీఐ బ్యాంకులో కలకలం - ముమ్మర దర్యాప్తులో పోలీసులు బషీరాబాద్, దర్శిని ప్రతినిధి : అర్దరాత్రి ఓ దొంగా ముఖానికి మాస్కు వేసుకుని దర్జాగా బ్యాంకులోకి చొరబడ్డాడు. అందరు నిద్రిస్తున్నవేళ బ్యాంకులోకి ప్రవేశించాడు. సీసీ కెమెరాలతో దొంగ కదలికలు నమోదయ్యాయి. kvcs శనివారం ఉదయం వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన బషీరాబాద్‌ మండల కేంద్రంలో కలకలం రేపింది. బషీరాబాద్‌ మండల కేంద్రంలో ఎస్బీఐ శాఖ బ్యాంకు కొనసాగుతోంది. ప్రతిరోజూ ఈ బ్యాంకులో లావాదేవీలు జరుగుతాయి. శుక్రవారం బ్యాంకు సమయం తరువాత అధికారులు, సిబ్బంది బ్యాంకును మూసి వెళ్లిపోయారు. శనివారం ఉదయం వచ్చి చూసే సరికి బ్యాంకు గేటు, తులుపు ధ్వంసమై ఉండడాన్ని గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. బ్యాంకు సీసీ కెమెరాలు పరిశీలింగా ఓ గుర్తుతెలియని వ్యక్తి ముఖానికి మాస్కు వేసుకుని లోపలికి చొరబడిన దృశ్యాలు కనిపించాయి. వెంటనే క్లూస్ టీంను రప్పించి వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. అయితే బ్యాంకులో కొత్త మేనేజర్ కొన్ని రోజుల క్రితమే విధుల్లోకి వచ్చారని తెలిపారు. బ్యాంకులో సుమారు రూ. 20లక్షల వరకు నగదు, విలువైన డాక్యుమెంట్లు ఉన్నాయని తెలిపారు. కాని దొంగతానికి వచ్చింది.. ఎవరు.. ఏం తీసుకెళ్లాడు అనే వివరాలు తెలియరాలేదు. పూర్తి విచారణ తరువాత వివరాలు వెల్లడిస్తామని బషీరాబాద్‌ ఎస్ఐ నూమన్ అలీ తెలిపారు. ఈ సంఘటన బషీరాబాద్‌లో కలకలం రేపింది. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/38241/