schedule Friday, September 04, 2026

వైద్య పరీక్షలు చేయించుకోవాలి

calendar_today September 1, 2025
person dharshininews
వైద్య పరీక్షలు చేయించుకోవాలి
వైద్య పరీక్షలు చేయించుకోవాలి - రెడ్డి ఘనాపూర్ లో టీబీపై అవగాహన బషీరాబాద్, దర్శని ప్రతినిధి : క్షయ వ్యాధిపై అవగాహన కలిగి ఉండాలని బషీరాబాద్ మండలం నవల్గా ఆరోగ్య కేంద్ర వైద్యులు అన్నారు. సోమవారం బషీరాబాద్ మండల పరిధిలోని రెడ్డి ఘనపూర్ లో నిర్వహించిన ఆరోగ్య కేంద్ర డాక్టర్ గోపాల్ ఆధ్వర్యంలో టీబీ వ్యాధిపై అవగాహన కల్పించారు. రెడ్డి ఘనాపూర్ గ్రామంలో టీబీ ముక్త అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. kvcs ఈ సందర్భంగా క్షయవ్యాధి, రక్తపోటు, హెచ్ఐవి, ధూమపానం, మధుమేహం వంటి వ్యాధు లపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ గోపాల్ సర్ మాట్లాడుతూ. ఎక్స్రే పరీక్షకు 20 మందికి పంపించినట్లు తెలిపారు. 15రోజులకు పైబడిన వారికి దగ్గు, ఆయాసం, ఛాతినొప్పి, జ్వరం, బరువు తగ్గుట వంటి లక్షణాలు ఉన్నవారు తప్పని సరిగా తెమడ పరీక్ష చేయించుకోవాలని సూచించారు. హెచ్ఐవీ ఉన్న ప్రతి ఒక్కరు తెమడ పరీక్ష చేయించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్ గోపాల్, MLHP మౌనిక, గౌరూత, అనిత, స్వప్న ANM విమల, ఆశాకార్యకర్తలు గ్రామ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి... https://www.dharshininews.com/38352/