schedule Friday, September 04, 2026

నైపుణ్య వేదికలు ఏటీసీలు..!

calendar_today September 27, 2025
person dharshininews
నైపుణ్య వేదికలు ఏటీసీలు..!
నైపుణ్య వేదికలు ఏటీసీలు..! - సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి - ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి - తాండూరులో ఏటీసీ కేంద్రం ప్రారంభం తాండూరు, దర్శిని ప్రతినిధి : యువతకు సాంకేతిక పరిజ్ఞానంతో నైపుణ్యాలను అందించే వేధికలుగా ఏటీసీ (అడ్వాన్స్డ్ టెక్నాలజీ) కేంద్రాలు నిలుస్తాయని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. శనివారం తాండూరు పట్టణం హైదరాబాద్ రోడ్డు మార్గంలోని డబుల్ బెడ్ రూం ఇళ్ల వద్ద అందుబాటులోకి వచ్చిన ఏటీసీ కేంద్రాన్ని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలకులు అభివృద్ధిని, సంక్షేమాన్ని పేపర్లకే పరిమితం చేశారని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత యువతకు, నిరుద్యోగులకు ఎన్నో అవకాశాలను కల్పిస్తోందని అన్నారు. ఒకప్పటిక ఐటీఐ కాలేజీల స్థానంలో ఆధునాతన పరికరాలతో ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు ఏటీసీ కేంద్రాలను అందుబాటులోకి తెచ్చిందన్నారు. ఈ ఏటీసీ కేంద్రాలు యువత నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలకు వేదికలుగా మారుతున్నాయని అన్నారు. kvcs యువత ఈ ఏటీసీ ( పరిజ్ఞానాలను, ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తాండూరులో ఏర్పాటు చేసిన ఏటీసీ కేంద్రంలో 172 సీట్లు పూర్తికావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ జిల్లా వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్, నాయకులు అబ్దుల్ రవూఫ్, మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, కాలేజీ ప్రిన్సిపల్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/38832/