schedule Thursday, September 10, 2026

రేపటి దసరాకు ముస్తాబు..!

calendar_today October 1, 2025
person dharshininews
రేపటి దసరాకు ముస్తాబు..!
రేపటి దసరాకు ముస్తాబు..! - ఉత్సవాలకు ముమ్మర ఏర్పాట్లు - హాజరు కానున్న చీఫ్ విప్, ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే - హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల నర్సింలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో దసరా ఉత్సవాలకు ముమ్మర ఏర్పాట్లు చేయడం జరిగిందని హిందూ ఉత్సవ కేంద్ర సమితి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల నర్సింలు తెలిపారు. ప్రతి యేడాది మాదిరిగానే పాత తాండూరులోని బోనమ్మ దేవాలయం వద్ద ఉత్సవాలు జరుగుతాయని పేర్కొన్నారు. దసరా ఉత్సవాల సందర్భంగా గురువారం సాయంత్రం 4 గంటలకు పట్టణంలోని నేహ్రు గంజ్ దేవాలయం నుంచి భారత మాత చిత్రపటంతో శోభాయాత్ర ప్రారంభమవుతుందని చెప్పారు. మర్రిచెట్టు కూడలి, గాంధీ చౌక్, భద్రేశ్వర చౌక్, మార్వాడీ బజార్, పటేల్ గార్డెన్ మీదుగా పాత తాండూరు బోనమ్మ దేవాలయం వరకు శోభాయాత్ర కొనసాగుతుందని వివరించారు. అనంతరం శమిపూజ, పాలపిట్ట దర్శనం, రావణ సంహార కార్యక్రమాలు జరుగుతాయని వెల్లడించారు. kvcs ఈ కార్యక్రమాలకు తెలంగాణ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిలతో పాటు ప్రముఖులు హాజరవుతారని చెప్పారు. కావున హిందూ బందువులందరు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని హిందూ ఉత్సవ సమితి గౌరవాధ్యక్షులు రాజుగౌడ్, అధ్యక్షురాలు స్వప్న పరిమళ్ తరుపున ప్రధాన -కార్యదర్శి పట్లోళ్ల నర్సింలు విజ్ఞప్తి చేశారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/38917/