schedule Wednesday, September 09, 2026

ప్రాణం తీసిన ఈత సరదా..!

calendar_today October 5, 2025
person dharshininews
ప్రాణం తీసిన ఈత సరదా..!
ప్రాణం తీసిన ఈత సరదా..! - చెరువు ఉదృతికి యువకుడి మృతి - ముకుందాపూర్ తాండాలో విషాధం యాలాల, దర్శిని ప్రతినిధి : స్నేహితులతో కలిసి సరదాగా ఈతకోసం వెళ్లిన ఓ యువకుడు ప్రాణాలను కోల్పోయాడు. ఈ సంఘటన ఆదివారం యాలాల మండలం ముకుందాపూర్ తండాలో చోటుచేసుకుంది. బాధిత కుటుంభ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తాండా కు చెందిన సునీల్ కుమార్(17) ఆదివారం తన స్నేహితులతో కలిసి గ్రామ సమీపంలోని ముద్దాయి చెరువులో ఈతకు వెళ్లాడు. చెరువులో ఇవతలి గట్టు నుంచి అవతలి గట్టుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో వరద నీటి ఉధృతి పెరగడంతో దాని ధాటికి తట్టుకోలేక సునీల్ నీటమునిగి పోయాడు. తోటి స్నేహితులు కాపాడేందుకు యత్నించినా ఫలితం లేకుండా పోయింది. kvcs సాయంత్రం వేళలో సునీల్ మృతదేహం బయటికి తీశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. చేతికి అందివచ్చిన కుమారుడు మరణించడంతో కుటుంబ సభ్యుల రోధనలు మిన్నంటాయి. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లుగా ఎస్సై విట్టల్ రెడ్డి తెలిపారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/38981/