schedule Sunday, July 05, 2026

కబ్జాలను తొలగించండి.. సారూ..!

calendar_today October 6, 2025
person dharshininews
కబ్జాలను తొలగించండి.. సారూ..!
కబ్జాలను తొలగించండి.. సారూ..! - మాంసం దుకాణాలతో ఇబ్బందులు - వీధి కుక్కలు, వాహానాల పార్కింగ్ వల్ల భయాందోళన - ఫిర్యాదును పట్టించుకోవడం లేదంటూ స్థానికుల ఆవేధన తాండూరు, దర్శిని ప్రతినిధి : రోడ్డు పక్కన చేసుకున్న కబ్జాలను తొలగించడం సారూ.. అంటూ తాండూరు పట్టణం శివాజీ చౌరస్తా ప్రాంత ప్రజలు కోరుతున్నారు. శివాజీ చౌరస్తా నుంచి మల్ రెడ్డిపల్లి వెళ్లే మార్గంలో మాంసం దుకాణాల కబ్జాల వల్ల ఇబ్బందులు పడుతున్నామని ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. ఈ మార్గంలో కొందరు మాంసం దుకాణాల వ్యాపారులు డ్రైనేజీలు, రోడ్లపై ఆక్రమణలకు పాల్పడి వ్యాపారాలు నిర్వహిస్తున్నారని అంటున్నారు. ఈ మార్గంలో పలు విద్యాయాలు కూడా ఉన్నాయని, సుమారు 8 వార్డుల ప్రజలు మార్గంలో ఆటోలు, కారులు, బైకులతో పాటు పలువురు కాలినడకన రాకపోకలు సాగిస్తుంటారని తెలిపారు. మాంసం దుకాణాల కబ్జాల వల్ల కొందరు రోడ్డుపై వాహనాలు పార్కింగ్ చేస్తున్నారని, దీంతో రోడ్డు ఇరుకుగా మారిపోతుందని తెలిపారు. kvcs ఇతర వాహనాల రాకపోకలకు ఇబ్బందులు జరిగి ప్రమాదాలు చోటు చేసుకునే పరిస్థితులు ఉన్నాయని అన్నారు. దీనికి తోడూ మాంసం దుకాణాల వద్ద వీధి కుక్కలు పదుల సంఖ్యల్లో సంచరిస్తున్నాయని, వీటి వల్ల చిన్నారులు, పెద్దలు భయాందోళనకు గురవుతున్నారని తెలిపారు. ఈ కబ్జాలపై చర్యలు తీసుకోవాలని గత నెలలో మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కబ్జాలపై చర్యలు తీసుకుని.. పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/38987/