schedule Sunday, July 05, 2026

మండల కేంద్రాల్లోనే నామినేషన్లు..!

calendar_today October 6, 2025
person dharshininews
మండల కేంద్రాల్లోనే నామినేషన్లు..!
మండల కేంద్రాల్లోనే నామినేషన్లు..! - 3 విడతల్లో పంచాయతీ, 2 విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు - జిల్లాలో పోలింగ్ స్టేషన్లు, ఎన్నికల అధికారుల నియామకం పూర్తి - స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్‌ కేంద్రాల ఎంపిక కూడా - వెల్లడించిన జిల్లా ఎన్నికల అధికారి ప్రతీక్ జైన్ వికారాబాద్, దర్శిని ప్రతినిధి : స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ప్రక్రియను ఖరారు చేశారు. ఈ మేరకు వికారాబాద్‌ జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ నియమ నిబంధనలను ప్రకటించారు. సోమవారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఎన్ఐసీ హాల్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, డిపిఓలతో కలిసి జిల్లా కలెక్టర్ పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణను పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. గ్రామపంచాయితి ఎన్నికలను మూడు విడతలుగా జిల్లాలోని 20 మండలాల్లోని 594 గ్రామపంచాయితీలకు 5058 వార్డులలోని పోలింగ్ నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. అదే విధంగా రెండు విడతల్లో 20 జడ్పిటిసి, 227 ఎంపీటీసీ స్థానాల ఎన్నికలను నిర్వహించేందుకు ఏర్పాట్లను సిద్ధం చేయడం జరిగిందని అన్నారు. ఎన్నికల నిర్వహణలు ఇలా.. గ్రామపంచాయితి ఎన్నికలను రెండవ విడతలో కొడంగల్, దౌల్తాబాద్, బొంరాస్ పేట్, దుద్యాల, వికారాబాద్, ధరూర్, మోమిన్ పేట, నవాబ్ పేట్, బంట్వారం, మార్పల్లి, కోట్ పల్లి 11 మండలాల్లొని 288 గ్రామపంచాయితిలలో 2490 వార్డులలో, మూడవ విడతలో పరిగి, పూడూర్, కుల్క చెర్ల, చౌడాపూర్, దోమ, తాండూర్, భాసీరా బాద్, యాలాల్, పెద్దేముల్, 9 మండలాల్లోని 306 గ్రామపంచాయితిలలోని 2568 వార్డులలో ఎన్నికలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. జడ్పిటిసి, యంపిటిసి ఎన్నికలను రెండవ విడతలలో 594 గ్రామపంచాయితీలలోని ఏర్పాటు చేసిన పొలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. kvcs జిల్లా ఓటర్ల వివరాలు.. నోటిఫికేషన్ వెలువడిన నాటి నుండి ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాలో పటిష్టమైన చర్యలు తీసుకున్నామని,జిల్లా లో మొత్తం ఓటర్లు 6,98 ,472 మంది, పురుషులు 3,43,668, మహిళలు 3,54,788, ఇతరులు 16,మొత్తం పోలింగ్ స్టేషన్ లు 1289,పోలింగ్ లొకేషన్లు 614, మొదటి విడత లో 11 మండలాలు 115 ,రెండవ విడత లో 09మండలాలు 112, మొత్తం 227 ఏం పి టి సి, జడ్ పి టి సి స్థానాలకు ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. అధికార యంత్రాంగం సిద్దం ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని జిల్లాలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు 4, రిసిప్సన్ సెంటర్లు 4, స్ట్రాంగ్ రూమ్స్ 3, కౌంటింగ్ సెంటర్స్ 3 ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇందుకొరకు 12 జిల్లా నోడల్ అధికారులు, 105 మంది జోనల్ స్థాయి అధికారులు, 45 ఫ్లయింగ్ స్క్వార్డ్ టీం లు, 59 సిట్టింగ్ స్క్వేడ్స్ టీంలు, 20 యంసిసి బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మండల కేంద్రాల్లోనే నామినేషన్లు... మండల కేంద్రాలలో నామినేషన్ స్వీకరణ కోసం అవసరమైన ఏర్పాట్లు చేస్తామన్నారు. నామినేషన్ల స్క్రూటినీ , ఉపసంహరణ, గుర్తుల కేటాయింపు ప్రక్రియ పై సిబ్బందికి శిక్షణ అందించాలని అన్నారు. పోలింగ్ రోజు పాటించాల్సిన నిబంధనల, విధుల పై అధికారులకు ముందుగానే సమగ్ర అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సుధీర్, అసిస్టెంట్ కలెక్టర్ హార్స్ చౌదరి, డిపిఓ జయసుధ , పత్రిక విలేకరులు తదితరులు పాల్గోన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/38997/