schedule Wednesday, September 09, 2026

బాబోయ్.. ఇవేం.. గుంతలు..!

calendar_today October 7, 2025
person dharshininews
బాబోయ్.. ఇవేం.. గుంతలు..!
బాబోయ్.. ఇవేం.. గుంతలు..! - పట్టణ రోడ్లపై భారీగా గోతులు - కళ్లున్నా.. కబోదుల్లా అధికారులు తాండూరు, దర్శిని ప్రతినిధి : బాబోయ్.. ఇవేం గుంతలూ అంటూ వాహనారులు బెంబేలెత్తుతున్నారు. తాండూరు పట్టణంలోని రోడ్ల దుస్తితిపై పట్టణ వాసులు, వాహనదారులు విసుగెత్తిపోతున్నారు. పట్టణంలోని విజయ విద్యాలయ పాఠశాల రోడ్డుపై గుంతలు ఏర్పడ్డాయి. సరిగ్గా చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద ఏర్పడిన గుంత భయంకరంగా మారింది. దానికి కొద్ది దూరంలోనే మరో గుంత ఏర్పడింది. సీసీ రోడ్డుపై ఏర్పడిన ఈ గుంతల వల్ల వాహనదారులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. ఈ గుంతలలో వాహనాలు అదుపుతప్పి పడిపోయతాయో అని ఆందోళనకు గురవుతన్నారు. kvcs ప్రమాదాలలో జరగరానిది జరిగితే ఎవరిది బాధ్యత అంటూ ప్రశ్నిస్తున్నారు. వాహనదారులే కాకుండా పాదచారులు కూడా గుంతల వల్ల ఇబ్బందులు పడే పరిస్థితులు ఉన్నాయని చెబుతున్నారు. సంబంధిత అధికారులకు రోడ్లపై గుంతలు కనిపిస్తున్నా.. కబోదుల్లా మారిపోయారని పలువురు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి రోడ్లపై ఏర్పడిన గుంతలు పూడ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/39001/