schedule Sunday, July 05, 2026

బీసీలపై బీఆర్ఎస్, బీజేపీలకు చిత్తశుద్ది లేదు

calendar_today October 10, 2025
person dharshininews
బీసీలపై బీఆర్ఎస్, బీజేపీలకు చిత్తశుద్ది లేదు
బీసీలపై బీఆర్ఎస్, బీజేపీలకు చిత్తశుద్ది లేదు - వారి రహస్య బంధంతోనే రిజర్వేషన్లకు అటంకాలు - కాంగ్రెస్ పార్టీతోనే బీసీ వర్గాలకు న్యాయం - బషీరాబాద్‌లో హస్తం జెండా ఎగరడం ఖాయం - కాంగ్రెస్ నాయకులు వెంకటేష్ మహరాజ్ బషీరాబాద్, దర్శిని ప్రతినిధి : బీసీలకు రిజర్వేషన్ల అమలులో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు చిత్తశుద్దిలేదని అర్థమై పోయిందని తాండూరు నియోజకవర్గం బషీరాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ సీనీయర్ నాయకులు వెంకటేష్ మహరాజ్ అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ బీసీలకు మంచి జరగడం ప్రతిపక్ష పార్టీ లు జీర్ణించుకోలేపోతున్నాయని అన్నారు. హైకోర్టు లో బీసీ రిజర్వేషన్ల పై జరిగిన సుదీర్ఘ వాదనలు, కాంగ్రెస్ పార్టీ తరఫున భారత దేశ ప్రముఖ లాయర్లు లో ఒకరైన శ్రీ అభిషేక్ మను సంఘ్వి గారు బీసీ లకు 42% రిజర్వేషన్ ఎందుకు ఇవ్వాలో చాలా స్పష్టంగా న్యాయ స్థానానికి వివరించారు, కానీ దురదృష్టవశాత్తు హైకోర్టు స్టే విధించడం విచారకరం అని అన్నారు. kvcs ఎంతో మంది 42% రిజర్వేషన్లు కోసం ఎన్నో బీసీ సంఘాలు, స్వచ్చంద సంఘాలు, దాదాపు 60 మంది దాకా అన్ని పార్టీలు ఇంప్లిఎడ్ పిటీషన్ వేయగా కేవలం BRS, BJP లు ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేయలేరు ఇందులోనే వారి చిత్తశుద్ధి తెలుస్తుంది అని విమర్శించారు. రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్‌ ఖర్గే, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, తాండూర్ ఎమ్మెల్యే బి మనోహర్ రెడ్డిలపై పూర్తి నమ్మకం ఉందని, బీసీలకు న్యాయం కాంగ్రెస్ పార్టీతో నే అవుతుంది అని ధీమా వ్యక్తం చేశారు. హైకోర్టు అడిగిన అన్ని రకాల వివరాలు అందించి కోర్ట్ ను ఒప్పించి వీలైతే సుప్రీం కోర్టు కి వెళ్లి న్యాయం జరిగేలా చర్యలు ప్రభుత్వం చేపడుతున్న నమ్మకం మాకు ఉందని అన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/39060/