schedule Wednesday, September 09, 2026

ఈనెల 18న తాండూరు బంద్

calendar_today October 12, 2025
person dharshininews
ఈనెల 18న తాండూరు బంద్
ఈనెల 18న తాండూరు బంద్ - అందరు మద్దతిచ్చి విజయవంతం చేయాలి - బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ తాండూరు, దర్శిని ప్రతినిధి : ఈనెల 18న తాండూరు బంద్ నిర్వహిస్తున్నట్లు బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ తెలిపారు. ఆదివారం ఆయన సంఘం నాయకులతో కలిసి మాట్లాడారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ల విషయంలో హైకోర్టు స్టే విధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య ఈనెల 18న రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కు పిలుపునిచ్చారని, ఇందులో భాగంగా అదే రోజు తాండూరు బంద్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. బీసీల హక్కుల సాధన, పరిరక్షణ కోసం శాంతియుతంగానే ఈ బంద్ కొనసాగిస్తామని అన్నారు. kvcs రాజకీయ పార్టీలు, సామాజిక సంఘాలు, వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు బంద్ కు మద్దతు ఇచ్చి జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు సయ్యద్ షుకూర్, గడ్డం వెంకటేష్, మహిళ అధ్యక్షురాలు అనిత, కార్యదర్శి విజయలక్ష్మీ, సోషల్ మీడియా ఇంచార్జ్ బసవరాజ్. పెద్దేముల్ మండల యూత్ అధ్యక్షులు నవీన్, రజక సంఘం జిల్లా అధ్యక్షులు కృష్ణ, నాయి బ్రాహ్మణ సమాజం అధ్యక్షులు పరమేష్, ముదిరాజ్ యువజన సంఘం కార్యదర్శి రాము ముదిరాజ్, యువ నాయకులు సురేష్, శ్రీశైలం, రాజు, దస్తప్ప, పాండు. గిరిజాపురం రమేష్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/39096/