schedule Sunday, July 05, 2026

బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలి

calendar_today October 14, 2025
person dharshininews
బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలి
బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలి - ఈనెల 18న బీసీ బంద్కు సంపూర్ణ మద్దతు - తాండూరు డివిజన్ కురుమ సంఘం నాయకులు తాండూరు, దర్శిని ప్రతినిధి : బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని తాండూరు డివిజన్ కురుమ సంఘం నాయకులు అన్నారు. మంగళవారం తాండూరు పట్టణంలోని బీరప్ప స్వామి సమావేశ మందిరంలో సంఘం సభ్యులు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఈనెల 18న చేపట్టే బీసీ బంద్ కు కురుమ సంఘం నుంచి సంపూర్ణ మద్దతు ఇచ్చేందుకు తీర్మానం చేసినట్లు తెలిపారు. కేవలం స్థానిక సంస్థల్లోనే విద్యా, ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని అన్నారు. బీసీలు రిజర్వేషన్లు సాధించుకోవడం హక్కుగా భావించాలని అన్నారు. పార్టీలకతీతంగా బీసీ నాయకులు అంతా ఏకమై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచేలా ఉద్యమించాలని అన్నారు. kvcs బీసీ హక్కుల సాధనకు చేపట్టే ఉద్యమాలకు కురుమ సంఘం తోడుగా ఉంటుందని, ఇందుకోసం ఎక్కడిదాకా అయినా ఉద్యమిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం డివిజన్ గౌరవాధ్యక్షులు, న్యాయవాది గోపాల్, అధ్యక్షులు నాగారం జగదీష్, ఉపాధ్యక్షులు పూజారి పాండు, రాష్ట్ర ఒగ్గుడోలు కళాకారుల ఉపాధ్యక్షులు పూజారి మల్లప్ప, విశ్రాంత ఉద్యోగులు శేఖర్. హనుమయ్య, మండల ఉపాధ్యక్షులు బిజ్జారం కృష్ణప్ప, కోశాధికారి దస్తప్ప, గొర్రె కాపర్ల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పల్లె వెంకటయ్య, దోమ భీమయ్య, ఆర్. వెంకటయ్య, మిట్టి మహేష్, వీరణ్ణ, వెంకటేష్, మల్కప్ప, కురువ శివకుమార్, సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/39118/