schedule Wednesday, September 09, 2026

రేపే తాండూరు బీసీ బంద్

calendar_today October 17, 2025
person dharshininews
రేపే తాండూరు బీసీ బంద్
రేపే తాండూరు బీసీ బంద్ - అందరి మద్దతుతో ఏర్పాట్లు పూర్తి - బీసీ సంఘం నాయకులు కందుకూరి రాజ్ కుమార్ - బంద్ కు మద్దతు తెలిపిన ఆటో యూనియన్ నాయకులు తాండూరు, దర్శిని ప్రతినిధి : బీసీ రిజర్వేషన్ల అమలు సాధనలో భాగంగా బీసీ జేఏసీ పిలుపు మేరకు రేపు శనివారం తాండూరు బీసీ బంద్ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఇందుకు అందరి సహకారంతో ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని బీసీ జేఏసీ నాయకులు కందుకూరి రాజ్ కుమార్ తెలిపారు. తాండూరులోని ఆర్టీసీ సంస్థ, పట్టణంలోని హోటళ్లు, షాపింగ్ మాల్స్, దుకాణాలు, కిరాణాషాపులు, వైన్స్ షాపులు, పెట్రోల్ పంపులు, అన్ని వ్యాపార సంఘాలు మద్దతు ఇస్తున్నాయని తెలిపారు. సామాన్య ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. అత్యవసరమైన సేవలకు మినయింపు ఇచ్చేలా దృష్టిసారించడం జరిగిందన్నారు. మరోవైపు తాండూరు బీసీ బంద్ కు ఆటో యూనియన్ సభ్యులు మద్దతు తెలిపారు. బంద్ లో స్వచ్ఛందంగా పాల్గోని ఆటోలు నిలిపివేస్తాయమని ప్రకటించారు. ఇందుకు రాజ్ కుమార్ తో పాటు బీసీ జేఏసీ నాయకులు సయ్యద్ షుకూర్, గడ్డం వెంకటేష్, పరమేష్ తదితరులు ధన్యవాదాలు తెలిపారు. kvcs ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/39173/