schedule Sunday, July 05, 2026

మాజీ సర్పంచ్ భర్తకు బీఎస్ఆర్ భరోసా

calendar_today October 24, 2025
person dharshininews
మాజీ సర్పంచ్ భర్తకు బీఎస్ఆర్ భరోసా
మాజీ సర్పంచ్ భర్తకు బీఎస్ఆర్ భరోసా - కుటుంబానికి అండగా ఉంటామని హామీ - పరామర్శించిన బుయ్యని శ్రీనివాస్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : బషీరాబాద్ మండల కేంద్రం మాజీ సర్పంచ్ ప్రియాంక భర్తకు, వారి కుటుంబానికి తాండూరుకు చెందిన వ్యాపార వేత్త, ఆర్బీఓఎల్ సీఈఓ, కాంగ్రెస్ నాయకులు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి మనోధైర్యం చెప్పారు. అనారోగ్యానికి గురైన ప్రియాంక భర్త శ్రావణ్ హైదరాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం ఈ విషయం తెలుసుకున్న బుయ్యని శ్రీనివాస్ రెడ్డి ఆసుపత్రికి వెళ్లారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రావణ్ ను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. శ్రావణ్ కుమార్ కు ఆత్మీయ భరోసాను అందించి ఆత్మస్థైర్యంతో ఉండాలని ధైర్యం చెప్పారు. అదేవిధంగా మాజీ సర్పంచ్ ప్రియాంకతో మాట్లాడి.. కుటుంబానికి అండగా ఉంటామని భరోసా అందించారు. kvcs శ్రావణ్ కు మెరుగైన వైద్యం అందించే విధంగా చూడాలని ఆసుపత్రి యజమాన్యంకు కోరారు. మరోవైపు తమను పరామర్శించి ధైర్యం అందించిన శ్రీనివాస్ రెడ్డికి శ్రావణ్ కుమార్, మాజీ సర్పంచ్ ప్రియాంకలు ధన్యవాదాలు తెలిపారు. శ్రీనివాస్ రెడ్డి వెంట మండల నాయకులు అజయ్ ప్రసాద్, లక్ష్మణ్ రావు, కిరణ్ తదితరులు ఉన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/39226/