schedule Sunday, July 05, 2026

సత్యసాయి శతజయంతి ఉత్సవాలకు రండి

calendar_today October 25, 2025
person dharshininews
సత్యసాయి శతజయంతి ఉత్సవాలకు రండి
సత్యసాయి శతజయంతి ఉత్సవాలకు రండి - జిల్లా కలెక్టర్‌ను ఆహ్వానించిన సమితి సభ్యులు తాండూరు, దర్శిని ప్రతినిధి : పుట్టపర్తి సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాలకు రావాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ను సత్యసాయి సేవా సమితి సభ్యులు కోరారు. శనివారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ ను సమితి సభ్యులు మర్యాద పూర్వకంగా కలిశారు. తాండూరు పట్టణంలోని సత్యసాయి సేవా మందిరంలో శత జయంతి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఉత్సవాలకు హాజరు కావాలని జిల్లా కలెక్టర్ ను కోరారు. kvcs శతజయంతి ఉత్సవాలలో భాగంగా ప్రతి ఆదివారం అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందుకు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సానుకూలంగా స్పందించినట్లు సత్యసాయి సేవా సమితి జిల్లా అధ్యక్షులు జగదీశ్వర్ సింగ్ ఠాకూర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సమితి సభ్యులు సురేందర్ పటేల్, వీరేశం గౌడ్, రవీందర్, సత్యానారాయణ గౌడ్, సిద్దమ్మ తదితరులు ఉన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/39247/