schedule Thursday, September 10, 2026

నీటి కష్టాలు తీర్చరేలా..!

calendar_today October 26, 2025
person dharshininews
నీటి కష్టాలు తీర్చరేలా..!
నీటి కష్టాలు తీర్చరేలా..! - పట్టింపులేని గ్రామ కార్యదర్శి - గాజీపూర్ గ్రామస్తులు ఆందోళన పెద్దేముల్, దర్శిని ప్రతినిధి : తాగునీటి కోసం అల్లాడుతుంటే పరిష్కారం చూపేందుకు ఎవ్వరు చొరవ చూపడం లేదంటూ పెద్దేముల్ మండలం గాజీపూర్ గ్రామస్తులు మండిపడుతున్నారు. గ్రామంలో తాగునీటి ఎద్దడి ఏర్పడినా పట్టించుకోకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేధన వ్యక్తం చేశారు. గాజీపూర్ గ్రామంలోని 1వ వార్డు బోనమ్మ దేవాలయం ప్రాంతంలో 15 రోజులుగా తాగునీటి సరఫరా కావడం లేదంటు ప్రజలు తెలిపారు. తాగునీటి సరఫరా చేసే బోరు మోటారు మరమ్మత్తులకు గురికావడంతో నీటి కష్టాలు తప్పడం లేదని అంటున్నారు. kvcs ఈ విషయాన్ని గ్రామ కార్యదర్శికి విన్నవించినా నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కనీసం ప్రాంతాన్ని పరిశీలించడం లేదని, బోరు మరమ్మత్తులు చేయించడం లేదని వాపోయారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సారు అయినా ప్రత్యేక దృష్టిసారించి తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు నాగభూషణం, ముస్తఫా, ఆనంద్, వెంకటయ్య, సర్దార్ బాబోద్దీన్, నాగప్ప, మహిళలు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/39260/