schedule Saturday, July 04, 2026

అలా ఎలా దాచావ్‌ రా.. సామీ..!

calendar_today October 27, 2025
person dharshininews
అలా ఎలా దాచావ్‌ రా.. సామీ..!
అలా ఎలా దాచావ్‌ రా.. సామీ..! - పాలిషింగ్ యూనిట్‌ గోదాంలో రేషన్ బియ్యం - బస్తాలను గుట్ట గుట్టులుగా దాచిన వైనం - టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల దాడులతో వెలుగులోకి తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసిన రేషన్ బియ్యాన్ని ఓ వ్యాపారి గుట్ట గుట్టలుగా గుట్టుగా నిల్వ ఉంచాడు. పక్కా సమాచారం అందుకున్న సివిల్ సప్లయ్ టాస్క్ ఫోర్స్ పోలీసుల బృందం ఆ గుట్టును రట్టు చేసింది. సుమారు 300 క్వింటాళ్ల రేషన్ బియ్యం బస్తాలను స్వాదీనం చేసుకున్నారు. ఈ సంఘటన సోమవారం జరిగింది. సివిల్ సప్లయ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బాణాపూర్ కు చెందిన మహేష్ అనే వ్యక్తి తాండూరు పట్టణం హైదరాబాద్ రోడ్డు మార్గంలో బషీర్ మీయా తాండాకు వెళ్లే కమాన్ సమీపంలో యాసర్ అర్ఫాత్ అనే వ్యక్తికి చెందిన పాలిషింగ్ యూనిట్ వద్ద ఉన్న గదుల్లో రేషన్ బియ్యం నిల్వ ఉంచినట్లు సమాచారం అందింది. kvcs ఈ మేరకు సివిల్ సప్లయ్ టాస్క్ ఫోర్స్ బృందం దాడులు నిర్వహించగా గదిలో బస్తాలను గుర్తించారు. వాటిని పరిశీలించగా 300 క్వింటాళ్ల వరకు ఉన్నట్లు గుర్తించారు. డీటీ ఫిర్యాదు మేరకు బియ్యం నిల్వ ఉంచిన మహేష్ పై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/39268/