schedule Thursday, September 10, 2026

రేపు జిల్లా కలెక్టరేట్ ముట్టడి

calendar_today October 28, 2025
person dharshininews
రేపు జిల్లా కలెక్టరేట్ ముట్టడి
రేపు జిల్లా కలెక్టరేట్ ముట్టడి - బీఆర్ఎస్వీ ఆద్వర్యంలో కార్యక్రమం - జయప్రదంకు పిలుపునిచ్చిన పట్టణ అధ్యక్షులు తాండూరు, దర్శిని ప్రతినిధి : రేపు వికారాబాద్‌ జిల్లా కలెక్టరేట్ ముట్టడి చేపడుతున్నట్లు బీఆర్ఎస్వీ తాండూరు పట్టణ అధ్యక్షులు పట్లోళ్ల సందీప్ రెడ్డి తెలిపారు. చలో విద్యార్థి - చలో కలెక్టరేట్ కార్యక్రమం పేరుతో ముట్టడిని చేపడుతున్నట్లు మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. విద్యార్థుల జీవితాలో చెలగాటం ఆడుతున్న సర్కారుకు విద్యార్థుల సెగ చూపించడం జరుగుతుందన్నారు. కావున విద్యార్థులందరూ భారీ ఎత్తున తరలివచ్చి కలెక్టరేట్ ముట్టడిని జయప్రయదం చేయాలని పిలుపునిచ్చారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/39283/