schedule Sunday, July 05, 2026

జిల్లాలో స్కూళ్లకు సెలవు..!

calendar_today October 29, 2025
person dharshininews
జిల్లాలో స్కూళ్లకు సెలవు..!
జిల్లాలో స్కూళ్లకు సెలవు..! - కలెక్టర్ ఆదేశాలతో ప్రకటన - ఉత్తర్వులు జారీ చేసిన డీఈఓ తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. వికారాబాద్‌ జిల్లా కలెక్టర్ ఆదేశాలతో జిల్లా విద్యాధికారి రేణుకా దేవి ఉత్తర్వులు జారీ చేశారు. మెంథా తుఫాను ప్రభావం వల్ల జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ విషయాన్ని పిఆర్టీయూ నాయకులు, యాలాల మండల అధ్యక్షులు కృష్ణారెడ్డి తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి దృష్టికి తీసుకవెళ్లినట్లు ఆయన తెలిపారు. దీంతో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌తో మాట్లాడినట్లు తెలిపారు. kvcs ఈ మేరకు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ జిల్లా విద్యాధికారికి ఆదేశాలు జారీ చేయగా.. జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రయివేటు యాజమాన్య విద్యాసంస్థలకు జిల్లాలో నెలకొన్న తుఫాను, భారీ వర్ష పరిస్థితుల దృష్ట్యా బుధవారం సెలవు ప్రకటించినట్లు తెలిపారు. ఈ మేరకు జిల్లా విద్యాధికారి అన్ని విద్యాసంస్థలకు సెలవు ఉత్తర్వులను జారీ చేశారు. అయితే ఉత్తర్వులు వెలువడక ముందే విద్యార్థులు పాఠశాలలకు తడుస్తూనే వెళ్లిపోయారు. తీరా ఉత్తర్వులు రావడంతో తిరిగి ఇంటికి చేరుకునేందుకు కూడా ఇబ్బందులు పడ్డారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/39297/