schedule Friday, September 04, 2026

ఆధార్ సేవలను విస్తరించాలి..!

calendar_today October 30, 2025
person dharshininews
ఆధార్ సేవలను విస్తరించాలి..!
ఆధార్ సేవలను విస్తరించాలి..! - ప్రవేటు సెంటర్ల వసూళ్లతో ప్రజలకు ఇబ్బందులు - పల్లెల నుంచి పట్టణాల వరకు సౌకర్యాలు కల్పించాలి - ప్రముఖ న్యాయవాది నర్సింగ్ రావు తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రజల అవసరాలకు అనుగుణంగా ఆధార్ సర్వీసు సేవలను విస్తరించాలని తాండూరుకు చెందిన న్యాయవాది, రాజకీయ వ్యూహకర్త నర్సింగ్ రావు ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం ఆధార్ సర్వీసులను ఆధునీకరించాలనే ఉద్దేశ్యంతో తీసుకొచ్చిన సాంకేతిక మార్పులు ప్రశంసనీయమైనవే అయినా, ప్రస్తుత పరిస్థితుల్లో అవే ప్రజలకు భారమవుతున్నాయి. ఈ సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు సంబంధిత శాఖలు ముందుకు రావాలని నర్సింగ్ రావు గారు ప్రభుత్వాన్ని కోరారు. ఆధార్ అప్‌డేట్‌ సాంకేతిక లోపాలతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. kvcs ప్రస్తుతం ఆధార్ అప్‌డేట్‌ ప్రక్రియలో రంగారెడ్డి జిల్లా నుండి వికారాబాద్ జిల్లా మార్పులు, చిరునామా సవరణలు వంటి సేవలు సాంకేతిక లోపాల కారణంగా సక్రమంగా పనిచేయకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర అవసరాల సందర్భాల్లో ఆధార్ వివరాలు అప్‌డేట్‌ చేయలేక, అనేక మంది తమ విలువైన సమయం, అవకాశాలను కోల్పోతున్నారని అన్నారు. ఇక ఆధార్ సేవా కేంద్రాలు, కొంతమంది ప్రైవేట్ వెండర్లు స్వచ్ఛందంగా నిర్ణయించిన రుసుములు వసూలు చేస్తున్నారని ప్రజల్లో ఆవేదన వ్యక్తమవుతోందని అన్నారు. కావున ప్రభుత్వాలు ప్రజలకు అనుగుణంగా ఆధార్ సర్వీసులను విస్తరించాలని కోరారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/39308/