రేపు తాండూరులో రన్ ఫర్ యూనిటీ
October 30, 2025
dharshininews
రేపు తాండూరులో రన్ ఫర్ యూనిటీ
- పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు
- భారీగా తరలివచ్చి జయప్రదానికి పిలుపు
తాండూరు, దర్శిని ప్రతినిధి : రేపు తాండూరు సబ్ డివిజన్ పోలీసు శాఖ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటి కార్యక్రమం ఏర్పాటు చేశారు.
గురువారం తాండూరు పట్టణ సీఐ సంతోష్ కుమార్ ఓ ప్రకటనలో ఈ విషయాన్ని తెలిపారు. స్వర్గీయ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150వ జయంతి సందర్భంగా వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి ఉత్తర్వుల మేరకు తాండూరు డీఎస్పీ బాల కృష్ణ రెడ్డి ఆధ్వర్యంలో *RUN FOR UNITY* కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
శుక్రవారం ఉదయం 6.30 గంటలకు విలియం మున్ చౌరస్తా నుండి రన్ ఫర్ యూనిటీ ప్రారంభం అవుతుందని చెప్పారు. ఇందిరా చౌక్ మీదుగా అంబేద్కర్ చౌక్ నుండి ఇందిరా చౌక్ వద్ద ముగుస్తుందని తెలిపారు. కావున ఈ కార్యక్రమంలో తాండూరు పట్టణం, పరిసర ప్రాంతాల ప్రజలు, విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇదికూడా చదవండి...
https://www.dharshininews.com/39313/