గొల్ల కురువలు అన్ని రంగాల్లో రాణించాలి
November 1, 2025
dharshininews
గొల్ల కురువలు అన్ని రంగాల్లో రాణించాలి
- కురుమల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి
- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య
- కురువ సోదరుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
- తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
- ఘనంగా బీరప్ప స్వామి దేవాలయం ప్రారంభోత్సవం
- రూ. 50లక్షలతో కుర్వ భవన్ కు శంకుస్థాపన
తాండూరు, దర్శిని ప్రతినిధి: గొల్ల కురుమలు అన్ని రంగాల్లో రాణించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. గొల్ల కురుమల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు.
శనివారం తాండూరు పట్టణం హైదరాబాద్ రోడ్డు మార్గంలో బీరప్ప దేవాలయ ప్రారంభోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో హాజరయ్యారు. అనంతరం బీర్ల ఐలయ్య ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో కలిసి రూ.50లక్షలతో నిర్మిస్తున్న కుర్వ భవన్ కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా విప్ బీర్ల ఐలయ్య మాట్లాడుతూ వెనుకబాటుకు గురైన గొల్ల కురుమలు విద్యా, రాజకీయం, వ్యాపారంతో పాటు అన్ని రంగాల్లో రాణించాలన్నారు.
తెలంగాణ ప్రభుత్వం గొల్ల కురుమల అభ్యున్నతికి కృషి చేస్తుందన్నారు. అదేవిధంగా తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గొల్ల కురుమలకు అండగా నిలుస్తున్నారని, ఎవ్వరు చేయని అభివృద్ధి చేసి చూపిస్తున్నారని అన్నారు. ఆయనకు అందరు అండగా నిలవాలని అన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ తాండూరు నియోజకవర్గంలో గొల్ల కురుమల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామన్నారు. ధర్మం వైపు నిలబడే గొల్ల కురుమలకు ఇచ్చిన ప్రతి హామిని నెరవేరుస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ, కురుమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎగ్గే మల్లేశం, గొల్ల, కురువ సంఘం నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి...
https://www.dharshininews.com/39347/