schedule Thursday, July 09, 2026

అదృష్టమంటే నీదే బాసు..!

calendar_today November 11, 2025
person dharshininews
అదృష్టమంటే నీదే బాసు..!
అదృష్టమంటే నీదే బాసు..! - ఒక్క జాక్‌పాట్‌తో కోటీశ్వరుడు - దశ మార్చిన మద్యం టెండర్ - రూ.3లక్షలతో కోటీకి పైగా లాభం వికారాబాద్, దర్శిని ప్రతినిధి : ఎవరైనా బేరం ఆడిగితే ధర తగ్గుతుంది. అదే బేరం పెడితే జాక్‌పాట్‌ తగులుతోంది. ఈ మద్య కాలంలో బేరం పెట్టి.. డబ్బులు పొందిన సంఘటనలు వైరల్ అవుతున్నాయి. తాజాగా వికారాబాద్ జిల్లాలో ఓ వ్యక్తి తనకు దక్కిన మద్యం టెండర్‌ను మద్యవర్తుల ద్వారా బేరం పెడితే కోటీశ్వరుడు అయ్యాడు. వివరాల్లోకి వెళితే... జిల్లాలో ఇటీవల మద్యం షాపులకు టెండర్లు నిర్వహించిన సంగతి తెలిసిందే. జిల్లాలోని కులకచర్లలో మొదటి మధ్యం షాపు ఓసీకి, రెండో షాపును ఎస్సీలకు కేటాయించారు. రెండో షాపు కోసం ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి టెండర్ వేశాడు. kvcs ఇదే షాపుకు 38 మంది టెండర్ వేశారు. ఇందులో కుల్కచర్లకు చెందిన ఎస్సీ వర్గానికి చెందిన ఓ వ్యక్తి రూ.3లక్షల నాన్ రిఫండబుల్ పీజుతో టెండర్ వేశాడు. గత నెల 27న తీసిన లక్కీ డ్రాలో అతడి మూడో నంబర్ టోకెన్ ఎల్లడంతో అదృష్టం వరించింది. తనకొచ్చిన మధ్యం షాపును సదరు వ్యక్తి మధ్య వర్తుల ద్వారా బేరం పెట్టాడు. ఈ బేరంలో చివరకు రూ.1.43 కోట్లకు అమ్ముకున్నట్లు సమాచారం. మొదటి షాపు దర్శించుకున్న వారే రెండో షాపును తీసుకున్నారు. మద్యం టెండర్లలో రూ. 3లక్షలు పెట్టిన వ్యక్తిని అదృష్టంతో కోటీశ్వరుడు కావడం హాట్‌ టాపిక్‌గా మారింది. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/39520/