schedule Thursday, September 10, 2026

పట్టణాభివృద్ధికి అధికారులు కృషి చేయాలి

calendar_today November 14, 2025
person dharshininews
పట్టణాభివృద్ధికి అధికారులు కృషి చేయాలి
పట్టణాభివృద్ధికి అధికారులు కృషి చేయాలి - సమస్యల పరిష్కారంలో వార్డు ఆఫీసర్ల దృష్టి - తాండూరు మున్సిపల్ కమీషనర్ యాదగిరి తాండూరు, దర్శిని ప్రతినిధి : పట్టణ అభివృద్ధికి అన్ని విభాగాల అధికారులు కృషి చేయాలని తాండూరు మున్సిపల్ కమీషనర్ బి. యాదగిరి అన్నారు. శుక్రవారం మున్సిపల్ కౌన్సిల్ హాల్లో కమీషనర్ యాదగిరి ఇంజనీరింగ్, వార్డు ఆఫీసర్లు, శానిటరీ ఇను స్పెక్టర్లు, బిల్ కలెక్టర్ తదితర విభాగాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పట్టణంలో వీధీ దీపాలు, తాగునీరు సరఫరా, మురుగు కాలువల నిర్వహణ తదితర మౌళిక సదుపాయాలపై వార్డు ఆఫీసర్లు దృష్టిసారించాలన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించి కాలనీలలో సమస్యలు గుర్తించి.. సంబంధిత అధికారుల దృష్టికి తీసుకరావాలన్నారు. సమస్యల పరిష్కారంలో కీలకంగా వ్యవహరించాల్సిన బాధ్యత వార్డు ఆఫీసర్లపై ఉందన్నారు. అదేవిధంగా పట్టణ అభివృద్ధిలో ఇంజనీరింగ్ శాఖల అధికారులు శ్రద్ధ చూపాలన్నారు. kvcs అభివృద్ధి పనులను గుర్తించి ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. శానిటరీ ఇను స్పెక్టర్లు వారడ్లో పర్యటించి పారిశుద్ధ్యం తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. బిల్ కలెక్టర్లు పన్నుల వసూళ్లను చేపట్టి ఆధాయాన్ని పెంచేందుకు కృషి చేయాలన్నారు. మున్సిపల్ లోని అన్ని శాఖల అధికారులు నిబద్ధతతో పనిచేసి పట్టణ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఈ మణిపాల్, శానిటరీ ఇను స్పెక్టర్లు, వార్డు ఆఫీసర్లు, వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/39624/