రోడ్డు కోసం కన్నెర్ర..!
November 15, 2025
dharshininews
రోడ్డు కోసం కన్నెర్ర..!
- జేసీబీతో రోడ్డు తవ్వేసి నిరసన
- కొత్త రోడ్డును వేయాలని డిమాండ్
- తాండూరు పట్టణంలో ఘటన
తాండూరు, దర్శిని ప్రతినిధి : మా కాలనీకి రోడ్డు వేయ్యరా.. అంటూ కాలనీ వాసులు కన్నెర్ర చేశారు. పాడైన రోడ్డును జేసీబీతో తవ్వేసీ నిరసన వ్యక్తం చేశారు.
ఈ సంఘటన తాండూరు పట్టణంలో జరిగింది. పట్టణంలోని వార్డు నెంబర్ 7లో రాయల్ కాంట వద్ద కాలనీ వాసులు ఈ దర్నా చేపట్టారు. రాయల్ కాంట నుంచి మసీదు లోపలికి వెళ్లే మార్గంలో రోడ్డు చాలా ఏళ్లుగా అధ్వాన్నంగా తయారైంది. రోడ్డును వేయకుండా పాలకులు, అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రోడ్డు మద్యలో బైటాయించి నిరసన వ్యక్తం చేశారు. వెంటనే కొత్త రోడ్డును వేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ విషయం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి దృష్టికి వెళ్లడంతో రోడ్డును త్వరలోనే వేయిస్తామని చెప్పడంతో స్థానికులు శాంతించి ఆందోళన విరమించారు.
ఇదికూడా చదవండి...
https://www.dharshininews.com/39626/