schedule Tuesday, September 08, 2026

చలికాలంలో వెచ్చని సేవ..!

calendar_today November 15, 2025
person dharshininews
చలికాలంలో వెచ్చని సేవ..!
చలికాలంలో వెచ్చని సేవ..! - వృద్ధులకు దుప్పట్ల పంపిణీ - లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అందజేత తాండూరు, దర్శిని ప్రతినిధి : సామాజిక సేవే తాండూరు లయన్స్ క్లబ్ ధ్యేయమని క్లబ్ అధ్యక్షులు శరణు బసప్ప అన్నారు. శనివారం తాండూరు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో యాలాల మండలం కోకట్ గ్రామంలోని వృద్దులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. చంద్రకాంత్ చారి దాతగా అందించిన దుప్పట్లను క్లబ్ అధ్యక్షులు శరణు బసప్ప చేతుల మీదుగా పంపిణీ చేశారు. గ్రామానికి చెందిన దాదాపు 60 మందికి దుప్పట్లను అందజేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు శరణు బసప్ప మాట్లాడుతూ సామాజిక సేవే ధ్యేయంగా లయన్స్ క్లబ్ సేవలు అందిస్తోందని అన్నారు. చలికాలంను దృష్టిలో ఉంచుకుని వృద్ధులకు దుప్పట్లను పంపిణీ చేయడం జరిగిందన్నారు. kvcs దీంతో పాటు ప్రతి నెలా 2వ, 4వ గురువారాలలో తాండూరు పట్టణం రేయిన్ బో ఆసుపత్రిలో పేదలకు ఉచితంగా కంటి వైద్య శిబిరాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కోశాధికారి గౌరీ శంకర్, సభ్యులు చంద్రకాంత్ చారి, గ్రామ కార్యదర్శి సుధాకర్, మాజీ సర్పంచ్ నారాయణ రెడ్డి, బజారప్ప, మాజీ వీఆర్ఓ శ్రీనివాస్ రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/39633/