schedule Tuesday, September 08, 2026

అట్టహాసంగా సదర్ ఉత్సవాలు..!

calendar_today November 18, 2025
person dharshininews
అట్టహాసంగా సదర్ ఉత్సవాలు..!
అట్టహాసంగా సదర్ ఉత్సవాలు..! - తాండూరులో మొదటి సారి ఫుల్ జోష్ - సందడి చేసిన దున్నపోతులు, ఊరేగింపు - పాల్గొన్న రాజకీయ, సంఘాల నేతలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో సదర్ ఉత్సవాలు అట్టహాసంగా కొనసాగాయి. ప్రభుత్వ సహకారంతో అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో నిర్వహించారు. మంగళవారం సాయంత్రం 5గంటల సమయంలో సింధు డిగ్రీ కాలేజీ, ఆదర్శనగర్‌లోని కట్ట మైసమ్మ దేవాలయం నుంచి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. వివిధ ప్రాంతాల నుంచి దున్నపోతులను రప్పించారు. సంఘం నాయకులు, పలు పార్టీల నాయకులు పాల్గొని దున్న పోతులకు పూజలు నిర్వహించారు. అనంతరం దేవాలయం నుంచి ఆర్టీసీ బస్ స్టేషన్, ఇందిరా చౌక్, గంజ్, గాంధీ చౌక్, భద్రేశ్వర ఆలయం వరకు ఊరేగింపు చేపట్టారు. భారీ సౌండ్‌ల మద్య పుర వీధుల్లో దున్నపోతుల ఊరేగింపు కొనసాగింది. ఊరేగింపులో దున్నపోతుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. తాండూరులో మొట్ట మొదటిసారి నిర్వహించిన సదర్ సంప్రదాయాలు అబ్బుర పరిచాయి. ఈ ఉత్సవాలలో తాండూరుకు చెందిన పలువురు నాయకులు, సంఘాల ప్రతినిధులు, యాదవ సంఘం యువకులు, పెద్దలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/39714/