schedule Tuesday, September 08, 2026

పెద్దేముల్ ఎస్ఐ వేణుపై వేటు

calendar_today November 19, 2025
person dharshininews
పెద్దేముల్ ఎస్ఐ వేణుపై వేటు
పెద్దేముల్ ఎస్ఐ వేణుపై వేటు - కొత్త ఎస్ఐగా శంకర్ నియామకం పెద్దేముల్, దర్శిని ప్రతినిధి : పెద్దేముల్ పోలీస్టేషన్ ఎస్ఐ వేణు కుమార్ పై వేటు పడింది. ఆయనను ఇక్కడి నుంచి వీఆర్ కు బదిలీ చేశారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి ప్రకటించారు. రెండు రోజుల క్రితం పెద్దేముల్ మండలం మంబాపూర్ గ్రామానికి చెందిన ఫిరోజ్ ను స్టేషన్ పిలిపించి.. ఎస్ఐ వేణు, కానిస్టేబుళ్లు దాడి చేశారని వివాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎస్ఐ వేణు కుమార్ ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఆయన స్థానంలో పెద్దేముల్ ఎస్ఐగా శంకర్ ను నియమించారు. ఎస్ఐ శంకర్ గతంలో తాండూరు పట్టణ ఎస్ఐగా, యాలాల ఎస్ఐగా, బషీరాబాద్ ఎస్ఐగా పనిచేశారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/39724/