schedule Tuesday, September 08, 2026

రేపు సబ్ కలెక్టర్ ఆఫీసు వద్ద నిరసన

calendar_today November 20, 2025
person dharshininews
రేపు సబ్ కలెక్టర్ ఆఫీసు వద్ద నిరసన
రేపు సబ్ కలెక్టర్ ఆఫీసు వద్ద నిరసన - బీసీల న్యాయ హక్కులను సాధించుకుందాం - బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ తాండూరు, దర్శిని ప్రతినిధి : బీసీ సంఘం ఆధ్వర్యంలో రేపు తాండూరు సబ్ కలెక్టర్ ఆఫీసు వద్ద నిరసన కార్యక్రమం చేపట్టబోతున్నట్లు ఆ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు, తాండూరు నియోజకవర్గ కన్వీనర్ కందుకూరి రాజ్ కుమార్ తెలిపారు. బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు, బీసీ జేఏసీ చైర్మన్ ఆర్. కృష్ణయ్య పిలుపు శుక్రవారం ఉదయం 11 గంటలకు మేరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లకు చట్టబద్దత కల్పించిన తరువాతే ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేస్తూ నిరసన కొనసాగుతుందని చెప్పారు. బీసీల న్యాయమైన హక్కులను సాధించుకునేందుకు మద్దతు ఇవ్వాలని కోరారు. కావున అఖిలపక్ష నాయకులు, బీసీ సంఘాల నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, విద్యావేత్తలు, బహుజన వాదులు పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/39756/