schedule Tuesday, September 08, 2026

ఎస్‌కేటీఎస్‌లో పుల్‌.. జోష్‌.!

calendar_today November 20, 2025
person dharshininews
ఎస్‌కేటీఎస్‌లో పుల్‌.. జోష్‌.!
ఎస్‌కేటీఎస్‌లో పుల్‌.. జోష్‌.! - అట్టహాసంగా బాలల దినొత్సవం - ఆడిపాడిన విద్యార్థులు, టీచర్లు - ఉపాధ్యాయులకు సన్మానం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం సాయిపూర్ రోడ్డు మార్గంలోని శ్రీ కృష్ణవేణీ టాలెంట్ స్కూల్‌(ఎస్కేటీఎస్)లో పుల్‌ జోష్‌ నిండింది. గురువారం తాండూరు పట్టణం తులసీ గార్డెన్‌లో స్కూల్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాలల దినోత్సవం అట్టహాసంగా జరుపుకున్నారు. బాలల దినోత్సవం సందర్భంగా విద్యార్థులు రంగు రంగుల వస్త్రాలంకరణలో ఆట పాటలతో సందడి చేశారు. విద్యార్థుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అదేవిధంగా విద్యార్థులు పలు ఉపన్యాసాలు ఇచ్చి అందరిని ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి స్కూల్ చైర్మన్ ద్యావరి విష్ణువర్ధన్ రెడ్డి, కరస్పాండెంట్ పట్లోళ్ల సర్వోత్తమ్ రెడ్డి, డైరెక్టర్ జయవర్దన్ రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్కేటీఎస్ విద్యార్థులకు ఉత్తమ విద్యనందించడంతో పాటు సంప్రదాయాలపై అవగాహన పెంచేందుకు కృషి చేస్తుందన్నారు. ప్రతి యేడాది మాదిరిగానే స్కూల్ ఆధ్వర్యంలో బాలల దినోత్సవం జరుపుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ నిజామాబాద్ రమేష్, ఉపాధ్యాయులు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి, సునిత, అనిల్, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/39765/