schedule Sunday, July 05, 2026

గల్లీ బాయ్స్ మానవత్వం..!

calendar_today November 27, 2025
person dharshininews
గల్లీ బాయ్స్ మానవత్వం..!
గల్లీ బాయ్స్ మానవత్వం..! - పాము కాటు మహిళ కూలీకి ఆర్థిక సాయం - గ్రేట్ అనిపించుకన్న గాజీపూర్ యువత తాండూరు, దర్శిని ప్రతినిధి : గ్రామంలో ఎవ్వరికి ఆపద వచ్చిన ఆదుకుంటున్నారు గాజీపూర్ గల్లీ బాయ్స్. తాజాగా పాముకాటుకు గురైన మహిళ కూలీకి ఆర్థిక సాయం అందించి మానవత్వం చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే.. ఐదు రోజుల క్రితం మండలంలోని గాజీపూర్ గ్రామానికి చెందిన సకినా భేగం గ్రామ సమీపంలోని చెర్ల నర్సింలుకు చెందిన పత్తి పొలంలో కూలీ పనికి వెళ్లింది. పని మద్యలో నీరు తాగేందుకు గట్టు వద్దకు వెళ్లింది. అక్కడే మాటు వేసిన పాము ఆమె నీరు తాగిన తరువాత చేతికి కాటు వేసింది. విషయం తోటి కూలీలకు తెలపడంతో వారు ఆమెను చికిత్స నిమిత్తం 108లో తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమెను మెరుగైన వైద్యం కోసం హైదారాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న గాజీపూర్ గల్లీ బాయ్స్ కూలీ కుటుంబానికి సాయం అందించేందుకు ముందుకు వచ్చారు. యువకులు అంతా కలిసి సకినా భేగం చికిత్స కోసం రూ. 7500లు ఆర్థిక సాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. యువత అందించిన సాయాన్ని పలువురు గాజీపూర్ గల్లీ బాయ్స్ గ్రేట్ అని అభినందిస్తున్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/39832/