schedule Sunday, July 05, 2026

ఎన్నికలు లేకుండా గెలిపించండి..!

calendar_today November 28, 2025
person dharshininews
ఎన్నికలు లేకుండా గెలిపించండి..!
ఎన్నికలు లేకుండా గెలిపించండి..! - అలా చేస్తే రూ. 30లక్షలు ఇస్తా - పెద్దెముల్ మండలంలో యువకుడి సంచలన ప్రకటన తాండూరు, దర్శిని ప్రతినిధి: పంచాయతీ ఎన్నికల్లో ఓటింగ్ లేకుండా గెలిపిస్తే ఊరికి రూ.30 లక్షలు ఇస్తానని వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం నాగులపల్లి గ్రామానికి చెందిన యాదవ్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. పంచాయతి ఎన్నికల్లో తనను ఏకగ్రీవంగా సర్పంచిగా ఎన్నుకుంటే గ్రామ అభివృద్ధి కోసం ₹30 లక్షల రూపాయల నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఈ 30 లక్షల్లో హనుమాన్ మందిరానికి ₹10 లక్షలు, ముస్లిం వెల్ఫేర్ కు 3.5 లక్షలు, క్రిస్టియన్ వెల్ఫేర్ కు 2.5 లక్షలతో పాటు ఎమర్జెన్సీ ఫండ్ కు 2 లక్షలు కేటాయిస్తానన్నారు. యువకులకు ప్రోత్సాహం ఇచ్చి తనకు అవకాశం కల్పించాలంటూ గ్రామస్తులను కోరారు. ఈ ప్రకటన చర్చనీయాంశం అయ్యింది. ఇదికూడా చదవండి...   https://www.dharshininews.com/39850/