schedule Wednesday, September 09, 2026

కిరాతక భర్త..!

calendar_today November 30, 2025
person dharshininews
కిరాతక భర్త..!
కిరాతక భర్త..! - సలికే పారతో భార్య హత్య - పెద్దేముల్ మండలంలో దారుణం పెద్దేముల్, దర్శిని ప్రతినిధి : కోపంలో ఓ భర్త కిరాతకుడుగా మారాడు. ఆలీ అన్న సంగతే మరిచి సలికే పారతో భార్యను అరాచకంగా హత్య చేశాడు. ఈ దారుణ సంఘటన పెద్దేముల్ మండలంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన ప్రాథమిక సమాచారం మేరకు... పెద్దేముల్ మండల కేంద్ర పరిధిలోని తాండకు చెందిన చౌహాన్ రవి, అనిత (35) భార్య భర్తలు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు, ఒక కుమారుడు ఉన్నారు. రవికి కొంత ఆరోగ్యం భాగాలేదు. ఇదే విషయంలో ఆదివారం మధ్యాహ్నం భార్య, భర్తలు గొడవ పడ్డారు. ఈ క్రమంలో కోపంతో రవి భార్యపై ఇంట్లో ఉన్న సాలికే పారతో కొట్టాడు. దీంతో అనితకు తీవ్రరక్తస్రావం అయ్యింది. రక్తపు మడుగులోనే అనిత అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో గ్రామస్తులు రవిని స్థానిక పోలీస్ స్టేషన్ లో అప్పచెప్పారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/39881/